సోనియా తల్లి అన్నాడు… బాబును తండ్రి అంటాడేమో!

రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీని తెలంగాణ తల్లి అంటున్న పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి, కొన్ని రోజులు ఆగితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును తండ్రి అని అంటాడేమోనని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు.

టిఆర్ఎస్ భవన్ లో ఇవాళ సింగరేణి కాలరీస్ సంస్థలో బిఎంఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య కు టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి కెటిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పార్టీలు మారడం గురించి మాట్లాడితే ప్రజలు తరిమి కొడాతారన్నారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నీతి మాటలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని అన్నారు. టిడిపిలో ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ కాంగ్రెస్ లో చేరిన తరువాత రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. ఆయనకు టిడిపి పాత వాసనలు పోలేదు. టిపిసిసి కాదు తెలుగు కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలంటున్నాడు, మరి నువ్వు మారావు కదా ఏ రాయి తో కొట్టాలో చెప్పాలన్నారు. రాజస్థాన్ లో సిఎం అశోక్ గెహ్లాట్ కూడా అదే చేశారు ? ఆయన్ను కూడా రాయితో కొట్టాలి ?. చిన్న పదవి రాగానే ప్రధాన మంత్రి పదవి వచ్చినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాడు. కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆగమాగం బ్యాచ్ లా ఉంది రేవంత్ తీరు అన్నారు. ఇకనైనా బాధ్యత గా మాట్లాడటం నేర్చుకోవాలి. రేవంత్ లాంటి కుసంస్కారిని మనం పట్టించుకోవాల్సిన ఆవసరం లేదు. మన పని మనం చేసుకుపోదాం. మొరిగే కుక్కలను పట్టించుకోవద్దని కెటిఆర్ అన్నారు.
రాజస్థాన్ లో బిఎస్పి ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారినట్లే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి మారారన్నారు. బజారు నాయకులు చిల్లర మల్లర మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదవులు వస్తే ఉన్నతంగా పనిచేసుకుంటే మంచిదని హితవు పలికారు. సింగరేణి కార్మికుల కోసం తీర్మానం చేసిన బిజెపి బుట్టదాఖలు చేసిందని, తెలంగాణ పథకాలు కాపీ కొట్టి కేంద్రం పథకాలు తేస్తోందని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గానికి బిజెపి ప్రభుత్వం రూ.1వెయ్యి కోట్ల ప్యాకేజి ఇస్తా అంటే మేము వద్దు అంటున్నమా?. కెసిఆర్ నాలుగు రోజులు బయట తిరుగుతే అందరి నోర్లు మూతపడ్డాయన్నారు. తప్పిపోయిన వాళ్ళు తిరిగి సొంత గూటి కే చేరుకున్నట్టుగా ఉంది.

ఈ ప్రభుత్వం లో సింగరేణి కార్మికులకు మేలు జరిగిందే తప్ప అన్యాయం జరగలేదు. కెసిఆర్ నాయకత్వం లోనే సింగరేణి కార్మికులకు న్యాయం జరుగుతుంది. 25-30 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటుందన్నారు. కెసిఆర్ అనే మహానేత నడుస్తుంటే కొంత మంది బిచ్చగాళ్ళు మొరుగుతున్నారు. అధికారాన్ని గుంజుకుంటామంటున్నారు. కెసిఆర్ ను తిట్టి శునకానందం పొందుతున్నారు. టివి లలో బ్రేకింగ్ న్యూస్ ల కోసం కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కెటిఆర్ అన్నారు.
ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు సిఎం గా ఉన్నారనే విషయం మరచిపోవద్దన్నారు. ఆయనను ఎదుర్కోవాలంటే అంతకన్నా ఎక్కువగా తెలంగాణ ను ప్రేమించగలగాలి. దుబ్బాక ఉప ఎన్నిక విజయం తో బిజెపి ఎగిరెగిరి పడింది, ఆ తర్వాత ఏం జరిగింది? నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి కి డిపాజిట్ కూడా దక్కలేదు. కాంగ్రెస్ లో బడా నేతనని చెప్పుకునే కె.జానారెడ్డి లాంటి నేతను మళ్ళీ ఓడించామన్నారు. 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లో జరిగిన రెండు ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ గెలిచింది. పాలపొంగు లాంటి గెలుపులను చూసి బిజెపి నేతలు మిడిసి పడ్డారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలు చేస్తారట. వారికి నా శుభాకాంక్షలు. వారికి కరోనా తర్వాత ఆరోగ్యమైనా కుదుట పడుతుంది. కనీసం పాద యాత్ర చేస్తే నైనా పల్లెలు టిఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో అభివృద్ధి చెందిన విషయం తెలుస్తుందన్నారు. రైతు బంధు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.