కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కెటిఆర్ మళ్లీ లేఖ

హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ మళ్లీ లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మిలిటరీ అధికారులు ఇష్టానుసారంగా రోడ్లు మూసేస్తున్నారని ఆరోపించారు.
మిలిటరీ అధికారులు దూకుడు చర్యల మూలంగా లక్షలాది మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, కంటోన్మెంట్ లో రోడ్లు మూసేయకుండా ఏరియా మిలిటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని తన లేఖలో కోరారు.

ఈ రోడ్ల మూసివేత విషయంపై పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని, గతంలోను లేఖలు రాశామని కెటిఆర్ గుర్తు చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని లహాబాద్ గేట్ రోడ్డు, గఫ్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు వంటి నాలుగు కీలక రోడ్లను కరోనా వైరస్ పేరుతో మూసివేశారని తెలిపారు. ఇలా అకస్మాత్తుగా మూసేయడం మూలంగా లక్షలాది మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవన్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు, సాయంత్రం ఇళ్లకు చేరుకునేందుకు ఎక్కువ కిలోమీటర్లు వాహనదారులు ప్రయాణించాల్సి వస్తున్నదని తెలిపారు. తక్షణమే నాలుగురోడ్లు తెరిచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.