కిలాడీ లేడీ అరెస్టు

తిరుపతి: భర్త, పిల్లలు ఉండగానే మళ్లీ పెళ్లిళ్లు చేసుకుని మోసగిస్తున్న మహిళను అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. అలిపిరి పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో సుహాసినికి వివాహం అయ్యింది. వారిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా విజయపురం మండలం నారపురాజు కండ్రికాగకు చెందిన సునీల్ కుమార్ ను పెళ్లి చేసుకున్నది.

తిరుపతి ఎడిబి ఫైనాన్స్ లో పనిచేస్తున్న సునీల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. పెళ్లి అయిన తరువాత బంధువుల నుంచి రూ.6 లక్షలు, బంగారం తీసుకుని ఉడాయించడంతో సునీల్ లబోదిబోమంటూ అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆధార్ కార్డుపై ఆరా తీయగా నెల్లూరులో అప్పటికే పెళ్లైనట్లు తేలింది. సునీల్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒకరిని వివాహం చేసుకుని ఇలాగే మోసగించింది.

Leave A Reply

Your email address will not be published.