బెడిసికొట్టిన కిడ్నాప్ డ్రామా…

న్యూఢిల్లీ: ప్రియురాలితో కలిసి విదేశాలకు పారిపోదామని వేసిన కిడ్నాప్ డ్రామా బెడిసికొట్టడడంతో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాసలీలలు గుట్టురట్టయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశంతో అసలు విషయం బయటకొచ్చింది.
శుభమ్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ఆఫీసులో పనిచేస్తున్న స్నేహితుడి భార్య అనితతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. అప్పులు పెరగడం, ప్రియురాలితో విదేశాలకు వెళ్లేందుకు ఒక కుట్ర కోణానికి తెరలేపాడు.

అప్పు ఇచ్చిన వాళ్ల చేతిలో శుభమ్ బంధీగా ఉన్నాడని, అర్జెంటుగా రూ.25 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయలని అనిత గత నెల 21వ తేదీన ఆయన తండ్రికి ఫోన్ చేసింది. నగదు బదిలీ చేసేందుకు ఐదు వేర్వేరు బ్యాంకు ఖాతాలను కూడా పంపించింది. ఈ కాల్ పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన తండ్రి 29వ తేదీన న్యూఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాతా నెంబర్ల ఆధారంగా విచారించడంతో కిడ్నాప్ డ్రామా వెలుగు చూసింది. పోలీసులకు అనిత అడ్డంగా దొరికిపోయింది. శుభమ్ రిషికేశ్ లో ఉన్నాడని చెప్పగా అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని బెదిరించి రూ.25 లక్షలు తీసుకుని ప్రేమసితో కలిసి విదేశాలకు వెళ్లి స్థిరపడాలని అనుకున్నట్లు శుభమ్ పోలీసులకు వెల్లడించాడు.

 

Leave A Reply

Your email address will not be published.