ఖమ్మం టూ దేవరపల్లి రోడ్ నెంబర్ 765 డిజి

హైదరాబాద్‌: ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు లేన్ల రోడ్డుకు నేషనల్ హైవే హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నాలుగు లేన్ల రోడ్డుకు 765 డిజి నంబరునూ కేటాయించింది. సుమారు 158 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గాన్ని పూర్తిచేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించటం తెలిసిందే. తెలంగాణ నుంచి కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులకు సరకు రవాణాకూ ఈ మార్గం ఉపకరిస్తుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా పోర్టులకు వెళ్లనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.