సిఎం యడ్యూరప్ప మెలిక

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన రాజీనామాపై ఊహాగానాలు అని కొట్టేసినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తరువాత డీలా పడ్డారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

శుక్రవారం ప్రధానితో భేటీ అయిన తరువాత ఇవాళ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాతో సమావేశమవుతున్నారు. అయితే తన రాజీనామాపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ప్రధానితో రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడానని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రధానితో భేటీ సందర్భంగా… మీరు చెప్పిన విధంగా నడుచుకుంటాను, నేను సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. బిజెపి సిద్ధాంతినకి కట్టుబడి నడుచుకుంటాను, ఒకవేళ మీరు రాజీనామా చేయమంటే చేస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన ఒక షరతు విధించారని అంటున్నారు. తన కుమారులిద్దరికి జాతీయ రాజకీయాల్లో కీలక పదవులు ఇవ్వాలని కోరారు. అలా అయితే తను పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆ మధ్య యడ్యూరప్పను ఏపి గవర్నర్ గా నియమిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.