మళ్లీ సినిమాల్లో నటిస్తున్న కమల్

హీరో కమల్ హాసన్ మళ్లీ సినిమా రంగంలో బిజీ అయ్యారు. మొన్నటి వరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో ప్రచారం చేయాల్సి ఉండడంతో సినిమాలు చేయలేదు. ఎన్నికలు ముగియడంతో మళ్లీ నటనపై దృష్టి పెట్టారు.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా యూటిట్ తో కలిసి ఫస్ట్ పోస్టర్ ను కమల్ హాసన్ రిలీజు చేశాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ ఇంటర్ నేషనల్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పోస్టర్ ఫస్ట్ లుక్ లో టీ షర్ట్ వేసుకుని కమల్ కన్పించారు. యుద్దంతో అదిగో వెలుగు, శబ్ధంతో అరాచకత్వం నాశనం అంటూ పోస్టర్ పై రాశారు. ఈ సినిమాలో విలన్ మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తుండగా ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇవాల్టి నుంచి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది అభిమానులకు తెలిపేందుకు ఫొటోలను రిలీజు చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.