మరో మూడు రోజులు వర్షాలు
న్యూఢిల్లీ: వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాల్లో చలనం రావటంతో జమ్ముకశ్మిర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాజస్థాన్ లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశ రాజధానితో పాటు ఉత్తర భారతాన్ని కరుణించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయవ్యంగా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసాల పక్కన అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది.
ఈశాన్య అరేబియా సముద్రంలో గుజరాత్ తీరాన మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ప్రభావంతో దాదాపు దేశమంతటా వర్షాలు పడుతున్నాయి. వాతావరణ విభాగం అంచనా ప్రకారం రానున్న మూడు రోజులూ కోస్తాంధ్ర తెలంగాణల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఈనెల 17 వరకూ వర్ష ఉద్ధృతి కొనసాగుతుందని అధికారుల అంచనా. రేపు తెలంగాణలొ అతి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయి.