వలస పాలకుల దేశద్రోహ చట్టం అవసరమా?: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్య సమరయోధులను అణచివేసేందుకు వాడిన వలస చట్టాన్ని భారత ప్రభుత్వం ఇంకా ప్రయోగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

పేకాట ఆడేవారిపై కూడా ఈ చట్టాన్ని ప్రయోగించి, బెయిల్ రాకుండా చేస్తున్నారని మండిపడింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ఇలాంటి చట్టాలు అవసరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. స్వాతంత్ర్య పోరాటాన్ని అణిచివేసేందుకు దేశ ద్రోహ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వాడినట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్ వంటి వ్యక్తులపై కేసులను పెట్టారని కోర్టు వెల్లడించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారని, అన్నంటిని ఒకేసారి కలిపి విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.