హీరో సిద్ధార్థ్ చనిపోయాడా?!

యూ ట్యూబ్ ఛానల్ లో ఎవరు ఏం అప్ లోడ్ చేస్తున్నారో తెలియడం లేదు. నియంత్రణ లేకుండా కంటెంట్ ను అప్ లోడ్ చేయడం మూలంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కొందరిని లక్ష్యంగా చేసుకుని కక్షతో వీడియోలు పెడుతున్నారు.
యుక్త వయస్సులో చనిపోయిన 10 మంది దక్షిణాది తారలు అంటూ ఒక వీడియో ను యూ ట్యూబ్ లో పోస్టు చేశారు. ఆ థంబ్ నెయిల్ లో సౌందర్య, ఆర్తి అగర్వాల్, మధ్యలో హీరో సిద్ధార్థ్ ఫొటోను పెట్టారు.

ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ విషయం సిద్ధార్థ్ దృష్టికి వెళ్లడంతో కంగుతిన్నాడు. తను చనిపోయినట్లు వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూ ట్యూబ్ ఛానల్ కు కంప్లైంట్ చేశారు. దానికి స్పందించిన యూ ట్యూబ్ యాజమాన్యం… సారీ ఆ వీడియోలో ఏం తప్పులేదు కదా అంటూ సమాధానం పంపారు. వీడియోలో చనిపోయినట్లు సమాచారం లేదు కాని థంబ్ నెయిల్ లో ఫొటో పెట్టారు. జరిగిన తప్పును సరిదిద్దకుండా సమర్థించుకోవడం సిద్ధార్థ్ కు చికాకు తెప్పించింది. అది కూడా మూడేళ్ల క్రితం పోస్టు చేసిన వ్యక్తి ఇంత వరకు తప్పు సరిదిద్ద లేదు.

Leave A Reply

Your email address will not be published.