ప్రేమ పేరుతో ఇన్ స్పెక్టర్ వంచన

బెంగళూరు: ప్రేమ పేరుతో తిప్పుకుని, లైంగిక వాంఛలు తీర్చుకుని తీరా పెళ్లి చేసుకోవాలని నిలదీయగా కాదు పొమ్మన్నాడు. తనకు అప్పటికే పెళ్లి అయ్యిందని చెప్పడంతో షాక్ కు గురైన యువతి సదరు పోలీసు ఇన్ స్పెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బిజాపురలో కె.ఎస్.ఆర్.పి ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న తాయన్న ధనసాగర్ కు ఫేస్ బుక్ లో మైసూర్ కు చెందిన యువతి పరిచయం అయ్యింది.

ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో ఇరువురూ మొబైల్ నెంబర్లు తీసుకుని ప్రతి రోజు మాట్లాడుకునేవారు. సాన్నిహిత్యం పెరగడంతో వ్యక్తిగతంగా కలుసుకుని విహార యాత్రలకు తిరిగారు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నిజమే అని నమ్మిన యువతి గోవాతో పాటు ఇతర ప్రాంతాల్లో తిరిగింది. ఎలాగు పెళ్లి అవుతుందని తెలిసి లైంగిక వాంఛలకు అడ్డు చెప్పలేదు. కొద్ది రోజుల క్రితం పెళ్లి ఎప్పుడు అని అడగ్గా, తనకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని చెప్పడంతో యువతి షాక్ కు గురైంది. తను మోసపోయినట్లు భావించిన యువతి కృష్ణరాజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇన్ స్పెక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసతున్నారు.

Leave A Reply

Your email address will not be published.