ఇన్ సైడర్ ట్రేడింగ్ పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ: అమరావతి రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఏపి ప్రభుత్వం తరఫున న్యాయవాడులు దుష్యంత్‌ దవే, మెహఫూజ్‌ నజ్కి వాదనలు వినిపించారు.
ప్రతివాదుల తరఫున న్యాయవాదులు పరాస్‌ ఖుర్షీద్‌, శ్యామ్‌ దివాన్‌, సిద్ధార్థ లూత్రా వాదించారు. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులు ప్రస్తావించిన తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది. దీనిపై లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి లో భూముల కోసం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపారని జగన్ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఒక కులానికి పెద్ద ఎత్తున ఆర్థిక లభ్ది చేకూరిందనేది జగన్ ప్రభుత్వ వాదనగా ఉంది. గతంలో హైకోర్టు కూడా ఈ పిటిషన్ ను కొట్టివేయగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బాధితుల నుంచి ఫిర్యాదులు లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లింది. దీనిపై జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం కూడా నియమించింది.

Leave A Reply

Your email address will not be published.