ప్రారంభమైన జెఈఈ మెయిన్ పరీక్షలు
న్యూఢిల్లీ: ఐఐటి, నిట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జెఈఈ మెయిన్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా 828 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు 7,09,519 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్ర 6 గంటల వరకు మరొక షిప్టులో పరీక్షలు జరుగుతున్నాయి.
గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాలను విద్యార్థులను అనమతించారు. మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కాంటాక్టు లెస్ పద్దతిలో నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో హ్యాండ్ శానిటైజర్ అందచేశారు. ఒక షిప్టుకు వాడిన కంప్యూటర్లను మరో షిప్టుకు వాడకుండా నిబంధనలు విధించారు. పూర్తిగా కరోనా నిబంధనలు పాటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షా కేంద్రాల ఇన్ ఛార్జీలను ఆదేశించింది.