కాలువలో పసికందు శవం…
నిజామాబాద్: నిజాంసాగర్ ప్రధాన కాలువలో పసికందు మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కాలువ వద్దకు చేరుకుని విచారించారు.
ఎడపల్లి మండలం జానకం పేటలో శ్రీలక్ష్మీ నరసింహ ఆలయానికి వెళ్లే దారిలో నిజాంసాగర్ ప్రధాన కాలువ ప్రవహిస్తున్నది. ఈ కాలువలో శుక్రవారం ఉదయమే ఎవరో గుర్తు తెలియని పసికందు మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. అప్పుడే పట్టిన పసిపాపను వదిలేసి వెళ్లిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. పసిగుడ్డు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.