ఇండియా పాజిటివ్ కేసులు 41వేలు

న్యూఢిల్లీ: గత వారం రోజులుగా తగ్గినట్లుగానే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు రోజుల పాటు పాటు 40వేలకు దిగువన నమోదు అయిన కేసులు శనివారం నాటికి 41వేలు దాటాయి.

గత 21 రోజులుగా యాభై వేల లోపే పాజిటివ్ కేసులు నిర్థారణ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 41,157 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 42,004 మంది వైరస్ నుంచి కోలుకోగా, 518 మంది చనిపోయారు. మొత్తం కేసుల్లో 4,22,660 యాక్టివ్ గా ఉండగా, ఇప్పటి వరకు 3,02,69796 మంది బాధితులు కోలుకునన్నారు. మహమ్మారితో ఇప్పటి దాకా 4,13,609 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 2.13 శాతం ఉండగా, రికవరీ రేటు 97.31 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

Leave A Reply

Your email address will not be published.