ఇండియా తొలి కరోనా రోగికి మళ్లీ పాజిటివ్

త్రిసూర్: దేశంలో తొలిసారి కరోనా పాజిటివ్ సోకిన విద్యార్థినికి మళ్లీ వైరస్ సోకింది. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో హోం ఐసోలేషన్ లో పెట్టారు.

త్రిసూర్ కు చెందిన విద్యార్థిని చైనాలో వైద్య విద్యను అభ్యసించింది. ఆమె చైనా నుంచి రాగా పరీక్ష నిర్వహించగా అప్పట్లో కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 2020 జనవరిలో ఆమె తొలి కరోనా పేషంట్ గా నమోదు అయ్యింది. ఆమెతో పాటు మరో ఇద్దరు స్నేహితురాళ్లకు పాజిటివ్ వచ్చింది. 24 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. మళ్లీ ఢిల్లీ వెళ్లేందుకు ఆమె త్రిసూర్ లో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. లక్షణాలు మాత్రం ఏమి కన్పించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆమె హోం క్వారంటైన్ లో ఉందని తెలిపారు. ఇప్పటికే ఒక డోసు వ్యాక్సిన్ కూడా తీసుకున్నదని అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.