తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని నిన్నటి రోజు ఆదివారం నాడు 17,264 మంది భక్తులు దర్శించుకున్నారు.స్వామివారికి 7,879 మంది తలనీలాలు సమర్పించారు.
నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.1.87 కోట్లు. గత రెండు వారాలుగా తిరుమలకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.
ఇదిలా ఉండగా మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో జులై 28వ తేదీ బుధవారం పల్లవోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.