హుజూరాబాద్ ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్: వివేక్
కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని బిజెపి నాయకుడు జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇక్కడ పోటీ చేసేందుకు టిఆర్ఎస్ కు అభ్యర్థి దొరకడం లేదన్నారు.
కెసిఆర్ అయిన తరువాత నిత్యం అబద్దాలు చెబుతూ, ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని వివేక్ విమర్శించారు. ఎన్నికలు ఉన్నప్పుడే వరాలు ప్రకటిస్తూ ఓట్లు దండుకుంటున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కెసిఆర్ పాలను బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు ఉన్నప్పుడే ఫామ్ హౌస్ లో నిద్రలేచి బయటకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపి అభ్యర్థిగా ఓడిపోయిన తన కుమార్తె కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఎంపి గా ఓడిపోయిన బి.వినోద్ కుమార్ కు కూడా ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చారని ఆయన ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారు రోడ్ల మీద ఉంటే వీళ్లు మాత్రం ఓడిపోయినా పదవులు అనుభవిస్తున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.