చివరి నిమిషంలో ఇద్దరు మంత్రులపై వేటు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో సీనియర్లుగా చెలామణి అవుతున్న ఇద్దరు మంత్రులపై ప్రధాని నరేంద్ర మోదీ వేటు వేశారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు వీరు రాజీనామాలు సమర్పించడం, ఆమోదించడం జరిగిపోయాయి.
కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ లకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.
తక్షణమే పదవులకు రాజీనామా సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఊహించని పరిణామానికి ఇద్దరు మంత్రులు బిక్కమొహం వేశారు. చేసేది లేక తమ రాజీనామాలను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించారు. వీరిద్దరి రాజీనామాలను సహచర మంత్రులు, బిజెపి నాయకులు కూడా ఊహించలేదు. తమకు ఆర్ఎస్ఎస్ బలం ఉందని, ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో వ్యవహరించడం మూలంగానే కత్తెర పడిందంటున్నారు. వీరిద్దరి రాజీనామాతో మొత్తం 12 మంది రాజీనామా సమర్పించారు.