బెంగళూరు లో ధభేల్ ధభేల్
బెంగళూరు: బెంగళూరు మహానగరంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ శబ్ధాలు విన్పించాయి. ఒక్కసారి శబ్ధాలు గట్టిగా విన్పించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. వీటి ధాటికి ఇళ్లు, కార్యాలయాల్లో కిటికీలు కొట్టుకున్నాయి.
షార్జాపూర్, జెపి నగర్, జయా నగర్, బెన్సన్ టౌన్, ఉల్సూరు, ఇస్రో లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, సౌత్ బెంగళూరు, ఈస్ట్ బెంగళూరు లో భారీ శబ్ధాలు వచ్చాయని ప్రజలు తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన శబ్ధాలతో కిటికీలు కొట్టుకున్నాయని, ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నారు. ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. తమ విమానాల నుంచి ఇలాంటి భయంకరమైన శబ్ధాలు రావని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది.