ఫ్లిప్ కార్ట్ లో భారీ పెట్టుబడులు

ముంబయి: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో భారీ పెట్టుబడులు సమకూరుతున్నాయి. భవిష్యత్తులో పోటీ సంస్థల వత్తిడి తట్టుకునేందుకు పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకున్నది.

ప్రపంచంలోని పలు ఆర్థిక సంస్థల నుంచి రూ.26,800 కోట్లు పెట్టుబడులు రానున్నాయి. వచ్చే ఏడాది ఐపిఓ కు వెల్లాలని నిర్ణయించుకున్న ఫ్లిప్ కార్ట్ దాని కన్నా ముందే అదనపు నిధులు సమీకరించేందుకు ప్రణాళికలు వేసుకున్నది. కరోనా మహమ్మారి సమయంలో విక్రయాలు బాగా పెరిగాయి. ఖాతాదారుల అభిరుచులకు అనుగుణంగా నెట్ వర్క్ ను విస్తరించాలని నిర్ణయం తీసుకుని నిధులు సమీకరించుకుంటున్నది. సింగపూర్ కు ప్రభుత్వ సంస్థ సావరన్ వెల్త్ ఫండ్, సాప్ట్ బ్యాంక్ విజన్ ఫండ్, ప్రాంక్లిన్ టెంపుల్టన్, కెనడాకు చెందిన పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు కు చెందిన నిధులు ఇప్పటికే ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.