ఖానామెట్ భూముల వేలంపై హైకోర్టు స్టే
హైదరాబాద్: నగరంలోని ఖానామెట్‌లో భూముల వేలంపై కెసిఆర్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఖనామెట్‌లో గొల్డెన్ మైల్ ప్రాజెక్టులో 15 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ వేలం వేసింది. అయితే ఈ 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టిందని తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును లో పిటిషన్ వేశారు. తమ పూర్వీకుల సమాధులున్నాయని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు, తాత్కాలికంగా వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.