మామను దాటేసిన అల్లుడు
హీరో ధనుష్. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు. ఆయన దూకుడు ట్విటర్ లో మామూలుగా లేదు. తమిళంలో అందరిని మించిపోయాడు. తాజాగా ఆయన ట్విటర్ లో 10 మిలియన్ల ఫాలోవర్లను దాటేశాడు.
ధనుష్ తమిళంలో తన నటనను మొదలు పెట్టి బాలీవుడ్, హాలీవుడ్ వరకు పలు చిత్రాలలో నటించి మెప్పిస్తున్నాడు. కోలీవుడ్ లో ఏ నటుడికి లేనంతగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఊహించిన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. తలైవాకు, ఇళయదళపతికి బాక్సాఫీసు వద్ద బోలెదడంతా మాస్ ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియాలో మాత్రం అల్లుడు ధనుష్ దే హవా. బాలీవుడ్ తెరపై మరోసారి కన్పించనున్న ధనుష్ అత్రంగీ రే సినిమాతో రానున్నాడు. హాలీవుడ్ ప్రాజెక్టు గ్రే మ్యాన్ లోనూ మంచి పాత్ర పోషించాడు. త్వరలో ఆయన నటించనున్న సినిమాలు రిలీజు కానుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.