చైన్నైలో హీరో అర్జున్ హనుమాన్ ఆలయం
చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన ఫామ్ హౌస్ లో హీరో అర్జున్ హనుమాన్ ఆలయాన్ని నిర్మాణం చేశారు. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఆలయం నిర్మాణం చేయాలని ఆయన నిర్ణయించారు.
సుమారు 35 అడుగుల ఎత్తుతో శ్వేతవర్ణంతో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కుటుంబ సభ్యుల మధ్య వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఇటీవల సిఎం ఎం.కె.స్టాలిన్ ను కలిసి అర్జున్ ఆహ్వనించారు కూడా. విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అర్జున్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.