తిరుమలలో పెరుగుతున్న భక్తులు

తిరుమల: సెకండ్ తగ్గుముఖం పట్టడం, పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేయడంతో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది.
నిన్న శనివారం రోజున స్వామివారిని 18,195 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 7,754 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 1.24 కోట్లు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 19 నుండి 21వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలోప‌ల‌ ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Leave A Reply

Your email address will not be published.