గూగుల్ మీట్… మరిన్ని ఫీచర్లు

కరోనా మహమ్మారితో ఆన్ లైన్ కు అమాంతంగా డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి తమ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. ఇంటి నుంచి తమ బాస్ లు, సహచర ఉద్యోగులతో మాట్లాడేందుకు వివిధ యాప్ లను ఉపయోగిస్తున్నారు.
గూగుల్ మీట్ కూడా తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది.

లైవ్ స్ట్రీమ్ నిర్వహిస్తునే మరో పక్క గూగుల్ మీట్ హోస్ట్ కొత్త డొమైన్ ద్వారా మరింత మందిని సమావేశానికి వెల్ కమ్ చేయవచ్చు. కొత్త ఫీచర్ల వల్ల క్రాస్ డొమైన్ లైవ్ స్ట్రిమింగ్ చేయడానికి వీలుంటుంది. ఆడియో ఆఫ్ చేసిన తరువాత సమావేశానికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవడానికి క్యాప్షన్ల సౌకర్యం కల్పించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.