తప్పుడు వార్తలను తొలగిస్తున్న గూగుల్, ఫేస్ బుక్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటి నిబంధలన ప్రకారం సోషల్ మీడియా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ట్విటర్ మంకుపట్టు పడుతున్నా మిగతా సంస్థలు దారికి వచ్చాయి.
ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి జూన్ 15 వరకు నిబంధనలకు విరుద్దంగా ఉణ్న 3 కోట్లకు పైగా వార్తలు (కంటెంట్లు) తొలగించినట్లు ఫేస్ బుక్ వెల్లడించింది. నూతన ఐటి నిబంధనల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు నెలవారి నివేదికను ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి నెలా సోషల్ మీడియా, ఆన్ లైన్ మీడియా సంస్థలు నెలకొక సారి కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి టుంది. అభ్యంతరమైన వార్తలపై పర్యవేక్షణతో పాటు వాటి తొలగింపు వివరాలు తెలియపర్చాలి. ఆ ప్రకారంగానే ఫేస్ బుక్ జూలై 2వ తేదీన తొలి నివేదికను విడుదల చేసింది. మే 15 నుంచి జూన్ 15 వరకు పది కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇన్ స్టాగ్రామ్ వేదికపై కూడా 20 లక్షల కంటెంట్లపై చర్యలు తీసుకున్నారు. ఇదే రీతిన గూగుల్ సెర్చింజన్ కూడా చర్యలు తీసుకున్నది.

ఫేస్ బుక్ చర్యలు తీసుకున్న వాటిలో ఎక్కువగా నకిలీ వార్తలే అధికంగా ఉన్నాయి. హింసను ప్రేరేపించేలా ఉణ్న 25 లక్షల పోస్టులు, లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన 18 లక్షల కంటెంట్లు, విద్వేషాన్ని పెంచేలా ఉన్న 3 లక్షల పోస్టులు, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్న 5.8 లక్షల పోస్టులను తొలగించారు. తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నవాటిని తొలగించగా, కొన్నింటికి ఆడియన్న్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ 20 లక్షల కంటెంట్లపై, గూగుల్ సెర్చింజన్ 60వేల కంటెంట్లను తొలగించింది. పోస్టులపై 60వేలకు పైగా ఫిర్యాదులు అందాయని గూగుల్ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా కాపీరైట్ కు సంబంధించినవే ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.