ఆఫ్ఘన్ కు యుఎస్ దళాల గుడ్ బై

కాబూల్: ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, తాలిబన్ ఉగ్రమూకలను ఏరిపారేసేందుకు వచ్చిన అమెరికా, నాటో దళాలు తిరుగుముఖం పట్టాయి. రెండు దశాబ్ధాల పాటు ఉగ్రమూకలను తుదముట్టించిన అమెరికా, నాటో దళాల యుద్దం ముగిసింది.
ఆఫ్ఘానిస్థాన్ దేశంలోని విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిందని యుఎస్ ప్రకటించింది. ఈ రోజు బాగ్రం వైమానికి స్థావరం నుంచి బలగాలు తమ దేశాలకి తరలి వెళ్లాయి. మిషన్ పూర్తి కావడంతో స్వదేశాలకు సైనికులు వచ్చారని పోలండ్, జర్మనీ, ఇటలీ కూడా ప్రకటించాయి. రెండు దశాబ్ధాల యుద్ధానికి బాగ్రం వైమానిక స్థావరం కేంద్ర బిందువుగా ఉంది.

సుమారు 10వేల మందికి కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉగ్రమూకల ఏరివేతలో పట్టుబడిన వారిని బంధించేందుకు ఇక్కడ భారీ జైలు కూడా ఉంది. గత రెండు దశాబ్ధాలలో యుద్దం కోసం అమెరికా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు ఒక అంచనా. ఈ యుద్దంలో 47,245 మంద ఆఫ్ఘాన్ పౌరులు, 69వేల మంది ఆఫ్ఘాన్ సైనికులు, 2,442 మంది అమెరికా సైనికులు చనిపోయారు. నాటో దేశాలకు చెందిన సైనికులు 1,144 మంది చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి.
అమెరికా సైనిక బలగాల ఉపసంహరణతో భారత్ కు ముప్పేనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద సహాయకురాలిగా పనిచేసిన లీసా కర్టిస్ తెలిపారు. ప్రపంచంలో ఉగ్రవాదులకు తాలిబన్లు శిక్షణనిచ్చి పోత్సహిస్తున్నారు. వారే భారత్ లోని పార్లమెంటు పై దాడి చేశారని ఆమె వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.