హైదరాబాద్ లో గోల్డ్ మ్యాన్ సాచ్స్ ప్రారంభం

హైదరాబాద్: రాయదుర్గంలో ఇవాళ గోల్డ్ మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా కార్యాలయాన్ని ఓపెన్ చేశారు.
రానున్న మూడేళ్లలో 2,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు వివరించారు.

ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థలో ప్రస్తుతం 250 మంది పనిచేస్తున్నారన్నారు. 2021 చివరి నాటికి 800 మందికి ఉద్యోగాలిస్తామని, 2023 నాటికి 2500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ మ్యాన్ సాచ్స్ సిఈఒ సంజోయ్ ఛటర్జీ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.