బావిలో బాలిక…మరో 40 మంది పడిపోయారు!

భోపాల్: ఒక బాలిక ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సమీపంలోని బావిలో పడిపోయింది. ఆ బాలికను రక్షించడానికి చేరుకోగా గోడ కూలడంతో  మొత్తం 40 మంది అందులో పడిపోయారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని విధిషా జల్లాలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్నది. విధిషా సమీపంలోని బసోడాలో ఎనిమిది సంవత్సరాల బాలిక ఆడుకుంటూ వెళ్లి తెలియకుండానే బావిలో పడిపోయింది. బాలిక కేకలు విన్న కొందరు బావి వద్దకు చేరుకోగా, ఈలోపు పలువురు గుమికూడారు. బరువు పెరిగి బావి గోడ కూలడంతో ఒక్కసారిగా 40 మంది అందులో పడిపోయారు. వారందరినీ రక్షించేందుకు గ్రామస్థులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా ప్రాంతానికి పోలీసులు ప్రొక్లెయిన్లు, క్రేన్లు తీసుకుని వచ్చారు. ఈ లోపు ఎస్.డి.ఆర్.ఎఫ్ బలగాలు కూడా చేరుకున్నారు. అర్థరాత్రి వరకు 23 మందిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంకా చిన్నారి ఆచూకి తెలియరాలేదు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.