సెప్టెంబర్ 10 నుంచి గణపతి నవరాత్రులు

హైదరాబాద్: కరోనా నిబంధనల మధ్య ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్ రావు తెలిపారు. ఈ నెల 23న గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభిస్తామన్నారు.

సెప్టెంబర్ 10న గణేశ్ ఉత్సవాలు ప్రారంభించి 19వ తేదీన నిమజ్జన కార్యక్రమం జరుపుతున్నామన్నారు. విగ్రహాల తయారీకి అవసరమైన ముడి సరకు సకాలంలో సప్లై చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నగరంలో రోడ్లను బాగు చేయాలని, వీధి లైట్లు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి. మండపాల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తామని, తక్కువ ఎత్తులోనే విగ్రహాలను తయారు చేయిస్తామన్నారు. ఉత్సవాల్లో 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నామని భగవంత్ రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.