బావిలో నలుగురు దుర్మరణం
తిరువనంతపురం: బావిలో పూడిక తీసేందుకు దిగిన నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన కొల్లం జిల్లాలో చోటు చేసుకున్నది.
ఇవాళ ఉదయం నలుగురు కూలీలు బావిలో పూడిక తొలగించేందుకు దిగారు. పేరుకుపోయిన మట్టికుప్పలను తీసే సమయంలో విషవాయువులు వెలువడ్డాయి.
వాటిని పీల్చుకోవడంతో ఒకరి తరువాత ఒకరు మొత్తం నలుగురు ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. బావిలో చనిపోయిన నలుగురిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు ఘటనా ప్రాంతంలో కుప్పకూలాడు. వెంటనే అతన్ని అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనలో సోమరాజన్ (54), రాజన్ (35), మనోజ్ (32), శివప్రసాద్ (24) చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు.