ఐపిఓ కు జోమాటో… ఫౌండర్ తెగ టెన్షన్!

తొలిసారి దేశంలో ఒక ఫుడ్ టెక్ కంపెనీ జొమాటో ఐపిఓ కు వచ్చింది. రూ.9,375 కోట్లు సేకరించే లక్ష్యంతో ప్రారంభమైన ఐపిఓ ఈ నెల 16వ తేదీన ముగియనున్నది. అయితే సంస్థ ఫౌండర్ దీపిందర్ గోయల్ తెగ టెన్షన్ పడుతున్నాడు.

టెన్షన్ తట్టుకోలేక ఆయన మూడు సార్లు బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశానంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పలువురు స్పందించి అభినందనలు తెలియచేస్తూ రీ ట్వీట్ చేశారు. జొమాటోలో ట్రిఫుల్ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశా, స్ట్రెస్ ఈటింగ్ అంటూ దీపిందర్ ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. దీనిపై ఆన్ లైన్ పేమెంట్ సంస్థ పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్శ స్పందించాడు. సూపర్ లిస్టింగ్ మ్యాన్ దీపిందర్ కు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో పాటు నాక్కూడా ధక్ ధక్ మంటోంటి అంటూ జొమాటో అఫిషియల్ ట్విటర్ ఖాతా కూడా ట్వీట్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.