శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..

నాగర్ కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,314 క్యూసెక్యుల నీరు వస్తుండగా, 28,252 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 823.50 అడుగుల నీటిమట్టం ఉన్నది.

టిఎంసిల్లో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.54 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జల విద్యుత్ ను పూర్తి స్థాయిలో ప్రారంభించడం మూలంగా నీటి నిల్వలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ తో పాటు శ్రీశైలం ఎడమగట్టు కాలువపై జల విద్యుత్ కేంద్రాలను పూర్తి స్థాయిలో నడపాలని ఆదేశాలు జారి చేసింది.

Leave A Reply

Your email address will not be published.