లండన్ కు మళ్లీ మొదలైన విమానాలు
హైదరాబాద్: భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇతర దేశాలు తమ విమానాల రాకపోకలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు ఎక్కువగా ఉండడంతో యుకె తన సర్వీసులను రద్దు చేసిన విషయం విదితమే.
తాజాగా మళ్లీ లండన్ కు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక నుంచి హైదరాబాద్ టు లండన్ వెళ్లాలని అనుకునేవాళ్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించవచ్చని విమానాశ్రయ ప్రతినిధులు తెలిపారు.