గుట్కా దందాలో ఐదుగురి పోలీసులపై వేటు

కడప: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఐదుగురు పోలీసులపై జిల్లా ఎస్పి అన్బురాజన్ చర్యలు తీసుకున్నారు. గుట్కా దందాతో పాటు పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఓ కానిస్టేబుల్ ఇప్పటికే సస్పెండ్ చేశారు.
నలుగురు కానిస్టేబుళ్లు గుట్కా వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉండడంతో వీఆర్ కు బదిలీ చేశారు.

అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పోలీసు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లాలో గుట్కా మాఫియా రాజ్యమేలుతోందని, వైసిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గుట్కా దందాపై చర్యలు తీసుకోవాలని ఏపి డిజిపి గౌతం సవాంగ్ కు టిడిపి నాయకులు ఇటీవలే ఫిర్యాదు కూడా చేశారు.

Leave A Reply

Your email address will not be published.