విశాఖలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు

విశాఖపట్నం: మధురవాడ వాంబే కాలనీలో డెల్టా ప్లస్ తొలి వైరస్ కేసు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

మధురవాడ పి.హెచ్.సి పరిధిలోని నివాసి పాడి.మేరీ (51)కి టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ గా తేలింది. లక్షణాలు కాస్త తేడా ఉండడంతో నిర్థారించుకునేందుకు నమూనాలను హైదరాబాద్ సిసిఎంబి కి పంపించారు. మేరీ కి సోకింది డెల్టా ప్లస్ వేరియంట్ రకం అని పరీక్షలో తేల్చి రిపోర్టు పంపించారు. వైద్య సిబ్బంది వాలంటీర్ల సహాయంతో చుట్టు పక్కల శానిటేషన్ నిర్వహించారు. బారికేడ్లతో పరిసర ప్రాంతాలను జివిఎంసి అధికారులు మూసివేశారు. ఆ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు.

Leave A Reply

Your email address will not be published.