కరోనా వార్డులో అగ్ని ప్రమాదం… 52 మంది మృతి

బాగ్దాద్: దక్షిణ ఇరాక్ నస్రియా లోని అల్ హుస్సేన్ హాస్పిటల్ కరోనా వార్డు భారీ అగ్ని ప్రమాదం జరగ్గా, చికిత్స పొందుతున్న 52 మంది పాజిటివ్ రోగులు చనిపోయారు. మరో 13 మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు.

మూడు నెలల క్రితం కరోనా రోగుల కోసం ప్రత్యేక వార్డును 70 మంచాలతో ప్రారంభించారు. అకస్మాత్తుగా ఏర్పడిన మంటలను ఆర్పేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. ఆక్సిజన్ ట్యాంకర్స్ పేలడం మూలంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్స్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారను. ఈ ఘటనపై ఇరాక్ ప్రధాని ముస్తఫా ఆల్ కాదేమీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అగ్నిప్రమాదానికి గల కారణాలపై విశ్లేషించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇరాక్ లో అగ్ని ప్రమాదంలో ఇంత భారీస్థాయిలో చనిపోవడం ఇది రెండోసారి, ఏప్రిల్ నెలలో బాగ్దాద్ లో ఒక హాస్పిటల్ లో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది చనిపోయారు. భారత దేశంలోనూ ఇటీవల పలు కరోనా వార్డుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో రోగులు చనిపోయిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.