ఇదేమి ఏయిర్ పోర్టు… ఇవేమి సౌకర్యాలు: రాజమౌళి

దేశ రాజధాని ఢిల్లీ ఏయిర్ పోర్టులో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఎంతో అభివృద్ధి చెందామని గొప్పలు చెప్పుకుంటున్న మనం ఏయిర్ పోర్టులో కనీస వసతులు కల్పించలేక పోతున్నామని సినిమా దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ఆందోళన వ్యక్తం చేశారు.

ఢిల్లీ ఏయిర్ పోర్టులో వసతులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. లుఫ్తాన్సా ఫ్లైట్ ద్వారా ఏయిర్ పోర్టులోకి చేరుకున్న తరువాత ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టుల కోసం ప్రయాణీలకు పత్రాలు అందించారు. వాటిని నింపేందుకు ప్రయాణీకులు నానా తంటాలు పడ్డారు. కనీసం కూర్చుని రాసేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు. కొందరు నేలపై కూర్చుని రాయగా, మరికొందరు గోడలపై పెట్టి రాశారు. టేబుళ్లను ఏర్పాటు చేయడం విమానాశ్రయం నిర్వహకుల కనీస విధి. బయటకు వచ్చే గేటు వద్ద ఉన్న హ్యాంగర్ సమీపంలో వీధి కుక్కల గుంపు తిరుగుతోంది. ఇలాంటి కుక్కల గుంపు చూస్తే మన దేశంపై కలిగే అభిప్రాయం గురించి ఒకసారి ఆలోచించండి అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.