సినీ విమర్శకుడు కత్తి మహేష్ మృతి

చెన్నై: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్ చనిపోయాడు. మహేష్ చనిపోయినట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
చెన్నై- కొలకతా జాతీయ రహదారిపై నెల్లూరు సమీపంలో జూన్ 26న ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

సొంతూరు చిత్తూరు జిల్లా పీలేరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆగి ఉన్న లారీని ఆయన కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ సీటు బెల్టు ధరించగా మహేష్ పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించాగా కంటికి శస్త్ర చికిత్సలు కూడా చేశారు. చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. మహేష్ చికిత్స ఖర్చుల కోసం ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రూ.17 లక్షలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.