డెల్టా వైరస్ కు వేగమెక్కువ: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆల్ఫా కన్నా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని కరోనా వర్కింగ్ గ్రూప్ చీఫ్ ఎస్.కె.అరోరా తెలిపారు. అల్ఫా కన్నా 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

గత ఏడాది అక్టోబర్ లో తొలుత భారత్ లో గుర్తించిన డెల్టా వేరియంట్ దేశంలో సెకండ్ వేవ్ కు కారణమైంది. ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కేసుల్లో 80 శాతం డెల్టా వైరస్ కు సంబంధించినవే కావడం గమనార్హం. ఇప్పటికే అమెరికా, సింగపూర్, బ్రిటన్, సౌది అరేబియా దేశాల్లో వేగంగా వ్యాప్తిస్తున్నదన్నారు. ఫస్ట్ వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ లో కూడా అధిక మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తున్నదన్నారు. మోడెర్నా వ్యాక్సిన్ కు కూడా అనుమతులు ఇచ్చామని అరోరా వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.