పాయింట్ బ్లాంక్ లో కాల్చుకున్న పోర్న్ స్టార్

లాస్ ఏంజిల్స్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ పోర్న్ స్టార్ డహ్లియా స్కై తన కారులోనే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తుపాకితో పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని చనిపోయినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ కార్యాలయం ప్రకటించింది.

గత నెల 30వ తేదీన డహ్లియా తన కారుతో విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శాన్ ఫెర్నాండో వ్యాలీలో డెవాన్ షైర్ ఏరియాలో స్వంత కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టు మార్టం తరువాత ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. నాలుగో స్టేజీకి చేరుకోవడంతో తీవ్రంగా మధనపడుతున్నది. 2010లో బైలీ బ్లూ పేరుతో పోర్న్ రంగంలోకి అడుగు పెట్టింది. డహ్లియా అంత్యక్రియల కోసం సాయం చేయాల్సిందిగా ఆమె తల్లి అభిమానులను కోరారు. సాయం చేస్తే రుణపడి ఉంటామని, సొంత ఇళ్లు కూడా లేదని తల్లి వాపోయింది.

Leave A Reply

Your email address will not be published.