బీర్ బాటిల్ పై పన్నులు తగ్గించిన ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో బీరు అమ్మకాలు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నది. ఒక్క బాటిల్ పై రూ.10 లు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఒక్కో బీర్ బాటిల్ పై స్పెషల్ ఎక్సైజ్ సెస్ పేరుతో రూ.30 విధించారు. ఇక నుంచి రూ.20 మాత్రమే విధించనున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బీరు అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. వారాంతాల్లో ఎక్కువగా యువత, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, మహిళలు అత్యధికంగా సేవిస్తారు.