వ్యాక్సిన్… దిగొచ్చిన ఏడు దేశాలు

న్యూఢిల్లీ: ఇండియా వ్యాక్సిన్ల విషయంలో యురోపియన్ యూనియన్ (ఈయు) దేశాలు దిగొచ్చాయి. ఇండియా వార్నింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. యూనియన్ లోని ఏడు దేశాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ వేసుకున్నవారిని ఈయు దేశాలు అనుమతించడం లేదు.

వేసుకుని వచ్చిన వారు సైతం ఈయులో దిగగానే క్వారంటైన్ కు పంపిస్తున్నారు. ఈ దుందుడుకు విధానంపై భారత ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీరు ఇలా వ్యవహరిస్తే యురోపియన్ దేశాల నుంచి తమ దేశానికి వచ్చేవారిని కూడా 14 రోజుల క్వారంటైన్ కు పంపిస్తామని హెచ్చరించింది. ఆస్ట్రియా, సోవేనియా, ఐస్ లాండ్, జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్ తో పాటు స్విట్జర్ లాండ్ కోవిషీల్డ్ వేసుకున్నవారిని అనుమతిస్తాని ప్రకటించింది. మిగతా దేశాలు ఇంకా స్పందించాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.