ఇటలీ అభిమానులను కిందేసి తొక్కిన ఇంగ్లండ్
లండన్: ఇంగ్లండ్ ఫుట్ బాల్ అభిమానులు యూరో కప్ ఇటలీ దక్కించుకోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఆటవికుల మాదిరి ప్రవర్తించి ఇటలీ అభిమానులను తన్ని తరిమేశారు.
ఆపై ఆ దేశ జెండాను కిందేసి తొక్కుతూ, ఉమ్మేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం జరిగిన యూరోపియన్ ఛాంపియన్ షిప్ లో ఇటలీ కప్ ను దక్కించుకున్నది. కొన్ని దశాబ్ధాల తరువాత కప్ గెలుచుకోవడంతో ఆ దేశ ప్రజల్లో ఆనందనాకి అవధులు లేకుండా పోయాయి. ఆ గెలుపే వారికి శాపంగా మారింది. ఫుట్ బాల్ ఆట ముగియానే ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయారు. కన్పించిన ఇటలీ అభిమానులను కిందపడేసి తొక్కుతూ దారుణంగా పిడిగుద్దులు గుద్దారు. ఇటలీ దేశ పతాకాన్ని కిందేసి, తొక్కి ఉమ్మేశారు. రాళ్లు విసరడంతో పలు భవనాలు అద్దాలు, కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన పలువురు క్రీడాభిమానులు ఇంగ్లండ్ అభిమానుల వైఖరిపై భగ్గుమంటున్నారు.