సుచిత్ర జంక్షన్ లో ఎలివేటెడ్ కారిడార్

హైదరాబాద్: హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై సుచిత్ర జంక్షన్, డైరీ ఫామ్ జంక్షన్, దూలపల్లి జంక్షన్, మేడ్చల్ టౌన్ వద్ద నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి నేషనల్ హైవే, ఆర్ అండ్ బి శాఖ కలిసి డిపిఆర్ లు రూపొందించాయని ఆర్ అండ్ మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

సుచిత్ర జంక్షన్ వద్ద నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ స్థలాన్ని సోమవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సుచిత్ర నుండి గుండ్లపోచంపల్లి వరకు 10 కి.మీ పొడవునా మూడు ఎలివేటెడ్ కారిడార్లు,నాలుగు అండర్ పాస్ లు, సర్వీస్ రోడ్లు, జంక్షన్ ల విస్తరణ జరగనుందన్నారు. దీనికోసం సుమారు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అట్లాగే గుండ్లపోచంపల్లి నుండి కళ్లకల్ వరకు 17కి.మీ సర్వీస్ రోడ్లు, జంక్షన్ ల విస్తరణ, మేడ్చల్ టౌన్ లో ఫ్లై ఓవర్, భూసేకరణ నిమిత్తం సుమారు రూ.800 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. నేషనల్ హైవే అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలు కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.