హిమాచల్ లో భూ ప్రకంపనలు…
షిమ్లా: రాష్ట్రంలో గిరిజన ప్రాంతమైన కిన్నౌర్ జిల్లాలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు బెదిరిపోయిన ప్రజలు నిద్రలోనుంచి మేల్కుని బయటకు వచ్చారు.
రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.1 గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయందని పేర్కొంది. శుక్రవారం రాత్రి 11.32 సమయంలో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంపంపై ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా రిపోర్టు కాలేదని, వివరాలు సదరు జిల్లా యంత్రాంగం నుంచి అందాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.