మొబైల్ ఫోన్ పగిలినా అతుక్కుంటుందా?

కొలకతా: మొబైల్ ఫోన్ స్క్రీన్ పగిలిపోతే ఇక అంతే సంగతులు. కొత్త స్క్రీన్ వేసుకోవాలి లేదంటే కొత్తది కొనుగోలు చేయాలి. లక్షలాది మంది ఏదో ఒక సందర్బంలో నష్టపోతున్నారు.

ఈ గండం నుంచి గట్టెక్కించేందుకు సైంటిస్టుల చేసిన ప్రయోగాలు ఫలించాయి. నిమిషాల్లో తన ఫోను తానే సరిచేసుకునే రసాయనాన్ని సైంటిస్టులు తయారు చేసింది. ఐఐఎస్ఆర్ కొలకతా, ఐఐటి ఖరగ్ పూర్ సైంటిస్టుల ప్రయోగ వివరాలు యుఎస్ కు చెందిన సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. ప్రస్తుతం మార్కెట్ లో సెల్ఫ్ హీలింగ్ మెటిరియల్స్ ఆటోమేషన్, ఏరోస్పేస్ రంగాల్లో అందుబాటులో ఉన్నాయి. దానికన్నా పదిరెట్ల శక్తిమంతంగా సైంటిస్టులు మొబైల్ ఫోన్ల కోసం తయారు చేశారు. ఎండ, వేడితో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్ ఛార్జితో రిపేర్ చేసే విధంగా తీర్చిదిద్దారు. ఒత్తిడి సమయంలో ఎలక్ట్రిక్ ఛార్జిలను సృష్టించే పదార్థాలే పీజో ఎలక్ట్రిక్ పదార్థాలుగా మారుతాయి. ఈ ఛార్జిని ఉపయోగించుకుని స్పటికాలు తిరిగి యథా రూపాన్ని పొందుతాయి. జీవ కణాలో రిపేరింగ్ మెకానిజం ఆధారంగా కొత్త పదార్థం పనిచేస్తుంది. మొబైల్ స్క్రీన్ల నుంచి ఎల్ఈడి వరకు పగిలితే వాడుకునే యథా రూపానికి తెచ్చుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.