రిషబ్ పంత్ కు అక్కడే కరోనా వచ్చిందా!

లండన్: క్రికెటర్ రిషబ్ పంత్ తో పాటు మరో ఇద్దరు ప్లేయర్లకు కరోనా సోకడంతో ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రిషబ్ మరోసారి పాజిటివ్ టెస్టు చేయించుకోనున్నాడు. నెగెటివ్ వస్తే టీమ్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అయితే రిషబ్ పంత్ కు ఎక్కడ పాజిటివ్ సోకిందనే దానిపై టీమ్ సభ్యులు చర్చించుకుంటున్నారు. ఎక్కడ సోకిందనేది స్పష్టం కానప్పటికీ ఒక చోటికి వెళ్లడం మూలంగానే వచ్చిందని అనుమానిస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో యూరో కప్ మ్యాచ్ చూడ్డంతో పాటు పలు చోట్ల తిరిగు. ఆ సమయంలో డెంటిస్ట్ వద్దకు వెళ్లడం వల్లే పాజిటివ్ సోకిందని అంటున్నారు. ఈ నెల 8న పాజిటివ్ రాగా, అంతకు మూడు రోజుల ముందు టెస్టు కోసం ఒక డెంటిస్ట్ ను కలిశాడు. ఆ క్లినిక్ లోనే అతినికి వైరస్ సోకి ఉండవచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెలువరించింది. అంతకు ముందు వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ ఫుట్ బాల్ మ్యాచ్ చూశాడు.

Leave A Reply

Your email address will not be published.