ఆమె కోసం అంతకు తెగించాడా?

చండీగఢ్: పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాదని ప్రియురాలి, ఆమె స్నేహితుడి కారణంగా ఒక యువకుడు తనువు చాలించాడు. అంత్యక్రియలు నిర్వహించిన తరువాత అతని మొబైల్ ఫోన్ చూడగా సెల్ఫీ వీడియో ఉంది. అది చూసి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు.

హర్యానాలోని నర్సిర్ పూర్ గ్రామంలో ముప్పై సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనీల్ మృతికి కారణమేంటో తెలియని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు చేశారు. ఆ తరువాత అతని మొబైల్ ఫోన్ ను పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు అనీల్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు మంజిత్, ఢిల్లీకి చెందిన ప్రియురాలు కారణమని తెలిపాడు. ఈ వీడియోను అనీల్ సోదరుడు పోలీసులకు అందచేసి, ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.